జాతీయ జెండాలతో తపాలా ఉద్యోగుల ర్యాలీ..

share on facebook
చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 12 : ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆజాది అమృత్ మహోత్సవ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం చేర్యాల మండల కేంద్రంలో తపాల శాఖ ఆధ్వర్యంలో స్థానిక పోస్టు ఆఫీస్ నుండి కొత్త బస్టాండ్ మీదుగా చేర్యాల పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచిన నఖాషి చిత్రకళను పోస్టల్ సిబ్బందికి చూపించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టల్ అధికారి రమాదేవి మాట్లాడుతూ.. స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు కావస్తున్నా సందర్భంగా భారతదేశంలోని ప్రతీ ఒక్క ఇంటి మీద భారత దేశ జెండా ఎగరాలన్నారు. భారత దేశ ఐక్యతను ప్రపంచ దేశాలకు చూపించాలని తెలిపారు. పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో కేవలం 25 రూపాయలకే జాతీయ జెండాను విక్రయిస్తున్నామని, ప్రతి ఒక్కరూ జెండాను వారి ఇంటి ముందు ఎగురవేయాలని కోరారు. ఈ ర్యాలీలో ఎస్పీఎం లు దిలీప్ కుమార్, రఘువరన్, భాస్కర్, సత్యం, మెయిల్ ఓవర్ సీర్ఈ బిక్షపతి, ఈడీ బీపీఎం లు నర్సింహులు,నరేష్, ఆనంద్, ముజాహిద్, నర్సింహులు,సంతోష్ శ్రీనివాస్ రాజు,పరుషరాములు నర్సయ్య, తిమ్మయ్య,రమేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
 

Other News

Comments are closed.