నీటి సమస్యను పట్టించుకోని ప్రభుత్వం

share on facebook

యెడ్యూరప్ప విమర్శలు
బెంగళూరు,జూన్‌7(జ‌నంసాక్షి): తీవ్ర నీటి సంక్షోభంతో కర్ణాటక కొట్టుమిట్టాడుతుంటే నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడంలో అధికార జేడీయూ విఫలమైందని, సంక్షోభాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ముఖ్యమంత్రి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ చీఫ్‌ యడ్యూరప్ప ఆరోపించారు. శుక్రవారంనాడిక్కడ విూడియాతో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం కరువుతో అల్లాల్లాడుతోందన్నారు. గ్రామాల్లో నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి బదులు ముఖ్యమంత్రి గ్రామ పాఠశాలలో బస చేస్తూ నాటకాలు ఆడుతున్నారని, ఇలాంటి డ్రామాలు పనిచేయవని యడ్యూరప్ప ఎద్దేవా చేశారు. కర్ణాటకలోని పలు జిల్లాల్లో నీటి కొరత తీవ్రమైన నేపథ్యంలో యడ్యూరప్ప తాజా వ్యాఖ్యలు చేశారు. అసలే కరువు, ఆపై రుతుపవనాలు ఆలస్యం కావడం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

Other News

Comments are closed.