పంట నష్టపోయిన రైతులకు అండ

share on facebook

జగిత్యాల,నవంబర్‌4 (జనంసాక్షి) :  భారీ వర్షాలతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే డక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు.  గ్రామాల్లో వర్షానికి దెబ్బతిన పంటలను రైతులతో కలిసి అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోతకు వచ్చిన వరి పొలాలు వర్షంతో నేల కొరగడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందనీ, అలాగే కళ్లాల్లో ఆరబోసిన మక్కజొన్న, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి రైతులు కోలుకోలేని పరిస్థితి నెలకొందన్నారు.
నష్టాన్ని వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేస్తున్నారని, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు వివరించి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బ్యాంకుల తప్పిదంతో బీమా కంపెనీలు పరిహారం చెల్లించేందుకు అడ్డంకులు ఎదురవుతున్నాయనీ, ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Other News

Comments are closed.