మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత…
బచ్చన్నపేట:నవంబర్18 జనంసాక్షి
మండలంలోని కొన్నే గ్రామానికి చెందిన నమిలే కృష్ణ కొద్దిరోజుల క్రితం మరణించగా నిరుపేద కుటుంబం కావడంతో సోమవారం ఆయన దశదిన కర్మ సందర్భంగా ప్రొపెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ సేవ సమితి చైర్మన్ బీజేపీ రాష్ట్ర నాయకులు కొత్తపల్లి సతీష్ కుమార్ సహకారంతో సేవసమితి సభ్యులు మృతుని కుటుంబానికి యాబై కిలోల బియ్యాన్ని అందజేశారు అనంతరం సేవసమితి సభ్యులు మాట్లాడుతూ మండలంలోని పేద ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చిన తమ దృష్టికి తీసుకెళ్తే తోచిన సహాయం అందిస్తామన్నారు మృతుని కుటుంబసభ్యులు కొత్తపల్లి సతీష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో తమ్మడి నవీన్ కుమార్.అఖిల్ మాల.రాజేష్ మాల.రసూల్.మైల రమేష్.అంబల రాములు.భిక్షపతి. మహేష్ పాల్గొన్నారు…