రైతులు సమగ్ర వ్యవసాయ విధానాలు పాటించాలి

share on facebook

నల్లగొండ,నవంబర్‌4 (జనంసాక్షి) : రైతులు సమగ్ర వ్యవసాయ పద్ధతులు  అవలంభిచేలా కేవీకే శాస్త్రవేత్తలు కృషి చేయాలని కేవీకేల పంచవర్ష సవిూక్ష కమిటీ అధ్యక్షుడు డాక్టర్‌ ఎస్‌.ఎన్‌.పూరి అన్నారు.  గడ్డిపల్లి, కంపాసాగర్‌, పాలెం, మధనాపురం, జహీరాబాద్‌లలోని కేవీకేలలో ఏడేండ్లుగా చేపడుతున్న కార్యక్రమాలు,
వాటి ప్రగతి, ప్రదర్శనల ద్వారా రైతులలో కలుగుతున్న మార్పులు, వారి ఆర్థికాభివృద్ధికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. నూతన సాంకేతిక విజ్ఞానం ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందే విధంగా శాస్త్రవేత్తలు కృషి చేయాలని సూచించారు.

Other News

Comments are closed.