స్వతంత్ర్య భారత వజ్రోత్సవాలలో భాగంగా బయ్యారంలో ర్యాలీ

share on facebook

బయ్యారం,ఆగష్టు13(జనంసాక్షి):
భారతదేశ స్వరాజ్య పాలన 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా “ఆజాది కా అమృత్ మహోత్సవ్” లో భాగంగా బయ్యారం పోలీస్ ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు.జాతి ఐక్యతను చాటి చెప్పే ఇంటింటా త్రివర్ణ పతాకంతో,మహనీయుల త్యాగల స్మరణతో,స్వతంత్ర్య సమరయోధుల నినానాదాలతో బయ్యారం మెయిన్ రోడ్డు నుండి ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో కస్తూరిబా పాఠశాల విద్యార్థినులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు,ఆశ వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది,సేవాలాల్ సేన మండలం అధ్యక్షులు రవి నాయక్,జగ్గు తండా సర్పంచ్ బోడ రమేష్,బయ్యారం సర్పంచ్ ధనసరి కోటమ్మ, గ్రామపంచాయతీ సిబ్బంది,పంచాయతీ కార్యదర్శి శ్రీధర్,ఉపాధ్యాయులు, బయ్యారం తహసీల్దార్ రమేష్ బాబు, ఎంపిడిఓ చలపతి రావు, సీఐ బాలాజీ, ఎస్సై రమాదేవి, కానిస్టేబుళ్ళు,తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.