2 నుంచి కీసర బ్ర¬్మత్సవాలు

share on facebook

మేడ్చల్‌,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): శివరాత్రిని పురస్కరించుకుని కీసరలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతులున్న కీసర బ్ర¬్మత్సవాలకు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయాలని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ డా.ఎంవీ రెడ్డి తెలిపారు. మార్చి 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కీసర రామలింగేశ్వర స్వామి బ్ర¬్మత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కీసర బ్ర¬్మత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. లోటుపాట్లకు అవకాశం ఇవ్వకుండ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. శాఖల మధ్య సమన్వయం కొరకు కమిటీని ఏర్పాటు చేసిన కలెక్టర్‌ డీఆర్‌డీఓ కౌటిల్యను కన్వీనర్‌గా నియమించారు. గత అనుభవనాలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయాలన్నారు. శివరాత్రికి భక్తులు అధికంగా రానున్న దృష్ట్యా ఏర్పాట్లు, బస్సల నిర్వహణ తదితర అంశాలపై చర్య తీసుకోనున్నారు.

Other News

Comments are closed.