ఎడిట్ పేజీ

మండలి రద్దు ఓ మంచి నిర్ణయం

రాజకీయ పునరావాసానికి కేంద్రంగా ఉన్న అన్ని వ్యవస్థలకు మంగళం పాడడం ద్వారా ప్రజల డబ్బులను ఆదాచేయాలి. వాటిని అభివృద్దికి కేటాయించాలి. గతంలో ఎన్టీఆర్‌ కాలంలో రద్దు చేసిన మండలిని పునరుద్దరించడమే తప్పు. పునరుద్దరించిన మండలితో ప్రజలకు ఒరిగిందేవిూ లేదు. నేరుగా ఎన్నిక కాలేని వారిని మండలిలోకి తీసుకుని వచ్చే యత్నాలతో లాభం లేదని నిరూపితం అయ్యింది. … వివరాలు

అక్షరాన్ని బతికించుకోవాలి

  దేశ భాషలందు తెలుగు లెస్స…అని కృష్ణదేవరాయలు అన్న పలుకు నిజంగానే ఆర్దత్ర కలిగి ఉంటుంది. తెలుగు అంటే అమ్మభాష. అమ్మభాషలో మాట్లాడుకోవడంలో ఉన్న ఆనందమే వేరు. దూరప్రాంతాలకు వెళ్లి మనవారు ఎవరైనా కలిస్తే మాట్లాడుకుంటే వచ్చే ఆత్మీయత అంతా ఇంతాకాదు. అలాంటి మనభాషను దూరం చేసుకోవడం అంటే ఎంతటి బాధ ఉంటుందో చెప్పలేం. మాతృభాష … వివరాలు

మహిళలకు భరోసాగా దిశ చట్టం

దిశ అత్యాచారం,హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేళ తాజాగా దీనిపై ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. హైకోర్టు,సుప్రీం కోర్టుల్లో ఎన్‌కౌంటర్‌పై విచారణ సాగుతోంది. ఈ దశలో ఎపి సర్కార్‌ ఓ సంచలన నిర్ణయం తీసుకుని దిశ చట్టాన్ని తీసుకుని వచ్చింది. ఇలాంటి చొరవ తీసుకుని ఓ పటిష్ట చట్టం తీసుకుని రావడం నిజంగా అభినందనీయం. దేశవ్యాప్తంగా … వివరాలు

సత్వర న్యాయం కోసం ఆలోచించాలి

హత్య,అత్యాచార కేసుల్లో తక్షణ న్యాయం అనేది సాధ్యపడదని స్వయంగా సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ శరద్‌ అర్వింద్‌ బోబ్దే చేసిన ప్రకటన ఇప్పుడు న్యాయం కోసం ఎదురు చూస్తున్న వారికి అశనిపాతంగా చూడాలి. న్యాయానికి కూడా ఓ సమయం ఉండాలి. ఎప్పటిలోగా న్యాయం జరుగుతుందన్న దానికి కూడా స్పష్టత ఉండాలి. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో చీఫ్‌ … వివరాలు

నైతిక విద్యతోనే నేరాలకు అడ్డుకట్ట

అత్యాచారం,హత్యల్లాంటి కేసుల్లో సత్వర న్యాయం జరక్కపోవడం లాంటి కారనాల వల్ల పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తోంది. ఇది ఎప్పటికైనా డేంజర్‌ అని గుర్తిచాలి. ఇప్పుడు చప్పట్లు కొడుతున్న ప్రజలే రేపు భయంతో పరుగెత్తే రోజులు వస్తాయి. హర్షిస్తున్న నేతలకు కూడా ఇది ముప్పుగా పరిణమిస్తుంది. అవినీతి, అక్రమాలకు పాల్పడే నేతలను కూడా కాల్చేయాలని ప్రజలు … వివరాలు

పోలీసులకు సలాం 

దిశను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి,ప్రాణాలతో ఉండగానే తగులబెట్టిన నలుగురు రాక్షసులు పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. తొలిపొద్దు పొడవకముందే వారిజీవితాలు కూడా చీకట్లో కలిశాయి. దిశను చీకట్లోనే చిదిమేసిన వారిజీవితాలు కూడా చికట్లోనే తెల్లారాయి. ఈ మొత్తం ఘటనలో దిశ తల్లిదండ్రులకు కొంత ఊరట దక్కినా వారి కూతురు మాత్రం తిరిగి రాదని గుర్తుంచుకోవాలి. వారి … వివరాలు

రాజ్యాంగ విలువలకు బిజెపి తిలోదకాలు

రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలు చేసే పాలకులు మకిలి చేష్టలకు పాల్పడితే అది అభాసు పాలుకాక తప్పదు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా దానిగురించి పాలకులు చాలా గొప్పగా అభివర్ణించారు. అంతకు ముందు రోజే రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు జరిగింది. గవర్నర్ల పాత్రకు నీతులు ఆపాదించారు. పార్లమెంటులో … వివరాలు

త్రిశంకు స్వర్గంలో ఆర్టీసీ కార్మికులు

ధిక్కారమును సహించేది లేదన్న రీతిలో తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఉన్నట్లుగా ఉంది. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసి, ఇక అస్త్ర సన్యాసం చేశారు. కొట్లాడే ఓపిక లేదన్న భావనలో ఉన్నారు. రాజు మొండిగా ఉన్న రాజ్యంలో ఓటమే తప్ప గెలుపు ఉండదు. ఆర్టీసీ కార్మికులకు ఇది అక్షరాలు వర్తిస్తుంది. అందుకే వారు సమ్మెను విరమించుకున్నట్లు ప్రకటించారు. … వివరాలు

మార్కెట్‌లో నిత్యావసరాల ధరాఘాతం

మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు మళ్లీ భయపెడుతున్నాయి. ధరల దాడితో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిత్యావసర వస్తువుల కు తోడు కూరగాయలు కూడా ధరలు పెరిగి వినియోగదారులకు ఇబ్బంది పెడుతున్నాయి. ఉల్లిధరలు అమాంతంగా పెరిగాయి. ఎంతగా పెరిగాయంటే అందుకోలేనంతగా పెరిగాయి. ఈ వారం రోజుల్లో ఉల్లి ధరలు రిటైల్‌ మార్కెట్లో 50 నుంచి అమాంతంగా వంద రూపాయాల … వివరాలు

మద్యం మత్తులో యువత 

దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో మద్యం ఏరులై పారుతోంది. మద్య నియంత్రణ, బార్ల కుదింపు వంటి చర్యల కారణంగా మద్యం ప్రవాహాన్ని అడ్డుకోవాలని ఎపి సర్కార్‌ కసరత్తు చేస్తోంది. అయితే పక్కనే యానం, ఇటు తెలంగాణలో మద్యం తక్కువ ధరలకే దొరకడంతో ఇప్పుడు చాలామంది దృష్టి ఇటువైపు పడింది. గతంలో ఎప్పుడూ లేనంతగా … వివరాలు