జిల్లా వార్తలు

సివిల్‌ సప్లై హమాలీల సమ్మె ప్రారంభం

కాగజ్‌నగర్‌,జూన్‌20(జ‌నం సాక్షి ): ప్రభుత్వం సివిల్‌ సప్లై హమాలీల కూలీ రేట్లను పెంచాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా స్థానిక హమాలీలు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా హమాలీ సంఘం ప్రతినిధి పెంటయ్య మాట్లాడుతూ హమాలీల కూలీ రేట్లు పెంచాలని, సంవత్సర బోనస్‌ను రూ. 4000 నుంచి 10,000 వేలకు పెంచాలని తదితర … వివరాలు

గొర్రెలకు నట్టల మందు పంపిణీ

కామారెడ్డి,జూన్‌20(జ‌నం సాక్షి ): గొర్రెలు పరిపుష్టిగా ఉండాలంటే వాటికి నట్టల మందు తప్పనిసరిగా తాగించాలని జిల్లా పశువైద్యాధికారి రమేష్‌కుమార్‌ అన్నారు. బుధవారం సదాశివనగర్‌ మండలకేంద్రంలో గొర్రెలకు నట్టల నివారణ మందు పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏడాదిలో మూడుసార్లు నట్టల మందు తాగించడం వల్ల గొర్రెలు ఆరోగ్యంగా ఉంటాయన్నారు. తొలకరి … వివరాలు

రైతుబంధుతో పెద్ద రైతులకే మేలు

మహబూబ్‌నగర్‌,జూన్‌20(జ‌నం సాక్షి ): రైతుబంధు పథకం పేరుతో ప్రజల సొమ్ము భూస్వాములకు దోచి పెట్టడం తప్ప రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని టిడిపి మహబూబ్‌నగర్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ పేర్కొన్నారు. పేదల డబ్బును పెద్దలకు బహిరంగంగా దోచి పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక, కుటుంబ పాలన కొనసాగుతోందని అన్నారు. రైతుబంధు రాబందుల … వివరాలు

పెట్రోల్‌ ధరలకు నిరసనగా రాస్తారోకో

కరీంనగర్‌,జూన్‌20(జ‌నం సాక్షి ): పెరిగిన పెట్రోల్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం సైదాపూర్‌ మండలకేంద్రంలోని కొత్త బస్టాండ్‌ ఏరియాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఐ మండల కార్యదర్శి గుండేటి వాసుదేవ్‌ మాట్లాడుతూ.. కేందప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరలు పెంచి సామాన్యులపై భారం … వివరాలు

సీఐఎస్‌ఎఫ్‌ జవాన్ల బైకు ర్యాలీ

హైదరాబాద్‌,జూన్‌20(జ‌నం సాక్షి ): బీహెచ్‌ఈఎల్‌ టౌన్‌షిప్‌లో సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లు బుధవారం ఉదయం బైకు ర్యాలీ నిర్వహించారు. భద్రత ప్రధానాంశంగా ఈ ర్యాలీ సాగింది. హెల్మెట్‌ ధరించాలి, మద్యం తాగి వాహనాలు నడుపరాదు’ అంటూ ప్లకార్డులు పట్టుకొని జవాన్లు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీహెచ్‌ఈఎల్‌కి చెందిన సీఐఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌ పాస్‌ పోర్టు కార్యాలయానికి అవార్డు

హైదరాబాద్‌,జూన్‌20(జ‌నం సాక్షి ): హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి అవార్డు లభించింది. పాస్‌పోర్టుల జారీలో అత్యుత్తమ సేవలకుగాను పాస్‌పోర్టు కార్యాలయానికి జాతీయ అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా పాస్‌పోర్టు అధికారి విష్ణువర్థన్‌ రెడ్డి మాట్లాడుతూ..జూన్‌ 1 నుంచి పాస్‌పోర్ట్‌ జారీ, పోలీసుల విచారణలో మార్పులు జరిగాయన్నారు. ఈ మూడేళ్లలో తెలంగాణ పోలీసులు కొత్త పరిజ్ఞానాన్ని అవలంబిస్తున్నారని … వివరాలు

టూ వీలర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

తల్లీ కుమారుడు మృతి ఆదిలాబాద్‌,జూన్‌20(జ‌నం సాక్షి ): జిల్లాలోని నేరేడిగొండ మండలం రోల్‌మామడ వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దంపతులు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఓ ఆర్‌టిసి బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో తల్లి, ఏడాదిన్నర కుమారుడు మృతి చెందారు. భర్తకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న … వివరాలు

నాపై ఫిర్యాదు చేసేందుకు.. 

ఢిల్లీ వెళ్లారని అనుకోవడం లేదు కాంగ్రెస్‌లోకొచ్చేందుకు తెరాస, బీజేపీ నేతలు రెడీగా ఉన్నారు పంచాయతీరాజ్‌ చట్టానికి విరుద్దంగా రిజర్వేషన్లు ఉన్నాయి టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి హైదరాబాద్‌, జూన్‌20(జ‌నం సాక్షి ) : తనపై ఫిర్యాదు చేసేందుకే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీ వెళ్లారని అనుకోవడం లేదని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. రాహుల్‌గాంధీకి బర్త్‌డే … వివరాలు

జీవిత బీమాతో రైతుకు భరోసా

సీఎం మానసపుత్రిక ‘రైతుబీమా’ గుంట భూమి ఉన్న వారికి పథకం వర్తిస్తుంది దేశానికి తెలంగాణ రైతును ఆదర్శంగా నిలపడమే కేసీఆర్‌ లక్ష్యం రైతుబంధుతో పెట్టుబడి ఇబ్బందులు తప్పాయి గతంలో ఈవిధంగా రైతుల గురించి ఎవ్వరూ ఆలోచించలేదు పాలమూరు ప్రాజెక్టులు పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీరిస్తాం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మహబూబ్‌నగర్‌లో రైతుబంధు ా … వివరాలు

బీజేపీ నేత కిషన్‌ రెడ్డికి ఊరట

హైదరాబాద్‌, జూన్‌20(జ‌నం సాక్షి ) : తెలంగాణ బీజేపీ నేత కిషన్‌ రెడ్డికి నాంపల్లి స్పెషల్‌ కోర్టులో ఊరట లభించింది. 2010లో విద్యార్థుల ఉపకార వేతనాల కోసం చేసిన ఆందోళనలో కిషన్‌ రెడ్డితో పాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కిషన్‌ రెడ్డిని నిర్దోషిగా తేలుస్తూ బుధవారం కోర్టు తీర్పు … వివరాలు