అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎంపీపీ.
పోటో రైటప్: పౌష్టికాహారం అందజేస్తున్న ఎంపీపీ.
బెల్లంపల్లి, సెప్టెంబర్ 3, (జనంసాక్షి)
బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి లోని అంగన్వాడీ కేంద్రాన్ని శనివారం బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా అంకితభావంతో పని చేయాలన్నారు. క్రమం తప్పకుండా గర్భిణులకు పరీక్షలు చేయించాలన్నారు. ఆయన వెంట అంగన్వాడీ సిబ్బంది. టీఆరెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు