అంగన్వాడీ కేంద్రాలలో పెరటి తోటల పెంపకంఅంగన్వాడీ కేంద్రాలలో పెరటి తోటల పెంపకం

 

 

 

 

 

మహబూబాబాద్ బ్యూరో-ఫిబ్రవరి 24 (జనంసాక్షి)
పిల్లలు గర్భిణీ స్త్రీలు బాలింతలకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించేందుకు న్యూట్రి గార్డెన్ లు  ఎంతగానో దోదపడతాయని సూపర్వైజర్ గోపమ్మ పేర్కొన్నారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం గార్ల మండల పరిధిలోని  పుల్లూరు సర్కిల్  అంగన్వాడి కేంద్రాలలో ఏర్పాటుచేసిన న్యూట్రి గార్డెన్ లో  ఆకుకూరలు కూరగాయలు మొక్కలను సాగు ను ఆమె పరిశీలించారు అనంతరం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలకు వచ్చే చిన్నారులకు బాలింతలకు గర్భిణీ స్త్రీలకు వండి వడ్డించే ఆహారంలో మరింత పోషక విలువలు ఉండేలా ఆహ్లాదకర వాతావరణంతో పాటు తాజా కూరగాయలతో ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా వండి పెట్టే వీలుంటుందని సాధారణంగా నిత్యం వంటా వార్పులలో కీలక పాత్ర పోషించే కూరగాయలు ఆకుకూరల మొక్కలు పెంచాలని సూచించారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు  అంగన్వాడి కేంద్రాలలో మెంతికూర చుక్కకూర పాలకూర తోటకూర కొత్తిమీర కరివేపాకు ఇలాంటి మొక్కలు సేంద్రియ పద్ధతితో సాగు చేసి చిన్నారులకు  ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.