అంటరానితనం నేరం.
– నెన్నెల ఎస్సై రాజశేఖర్.
నెన్నెల, మార్చ్ 31, (జనంసాక్షి )
అంటరానితనం నేరం అని నెన్నెల ఎస్సై రాజశేఖర్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని జంగాల్ పేట గ్రామంలో ఏర్పాటు చేసిన పౌర హక్కుల దినం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలన్నారు. ఎస్సి, ఎస్టీలపై చిన్నా చూపు చూడటం తగదన్నారు. కుల వివక్ష చూపితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. షెడ్యూల్డ్ కులాల, తెగలపై ఎలాంటి వివక్ష చూపిన తమ ద్రుష్టికి తీసుకురావాలన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోబడుతాయాన్నారు. ఈకార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ ప్రకాష్, గిర్థవర్ గణేష్, సర్పంచ్ రావుల సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు.