అంతర్జాతీయ మాదక ద్రవ్య ముఠా అరెస్టు

హైదరాబాద్‌: అంతర్జాతీయ స్థాయిలో మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్న ఒక ముఠాను పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. ఓ విదేశీయుడితో సహా ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేసిన పోలీసులు వారినుంచి పెద్దమొత్తంలో మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం తెలిసింది.