అందని ఆసరా పెన్షన్…….
ఇబ్బందుల్లో వృద్ధులు వికలాంగులు వితంతువులు……
***పెన్షన్ కార్డ్స్ పంపిణి చేసి చేతులు దులుపుకుంటున్న ప్రభుత్వం…….
***ఇంకా విడుదల కాని పెన్షన్ డబ్బులు…….
***తెలంగాణ జనసమితి మండల అధ్యక్షులు అంబాల రమేష్……
టేకుమట్ల.సెప్టెంబర్29(జనంసాక్ షి)రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్స్ అందించకపోవడం మూలంగా వృద్ధులు,వికలాంగులు,వితంతువులు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ జనసమితి మండల అధ్యక్షులు అంబాల రమేష్ అన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని వృద్ధులు,వికలాంగులు,వితంతువు లకు వారి వైద్య,ఇతర ఖర్చుల నిమిత్తం వారికి ఆసరాగా 2016,3016 రూపాయలు అందిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్న ఆసరా పెన్షన్స్ సుమారు రెండు నెలలుగా అందడం లేదని,ఐనా ప్రభుత్వం నిమ్మకు నీరేతినట్లు వ్యవహారిస్తుందని అన్నారు.అసలు పెన్షన్స్ వస్తాయో రావో అనే ఆందోళనలో పెన్షన్స్ దారులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసారు.నూతనంగా 10లక్షల మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ మంజూరు చేశామని గొప్పగా చెప్పుకుంటూ వారికి పెన్షన్ కార్డ్స్ పంపిణి చేస్తున్న ప్రభుత్వం ఆగష్టు నెలలో పెన్షన్ మంజూరు చేశామని సెప్టెంబర్1 నుండి ప్రతినెలా పెన్షన్ చెల్లిస్తామని ప్రభుత్వం చెపుతున్నప్పటికి నెల రోజులు గడిచిన ఇప్పటికి పెన్షన్ డబ్బులు బ్యాంకులో,పోస్ట్ఆఫీస్ లో జమ చేయడంలో పూర్తిగా విఫలం అయ్యిందని అన్నారు.పెన్షన్ డబ్బుల జమ అయ్యాయా అని తెలుసుకోవడం కోసం లబ్ధిదారులు బ్యాంక్ లు,పోస్ట్ ఆఫీస్ ల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని, ఇకనైనా ప్రభుత్వం స్పందించి పెన్షన్ డబ్బులు విడుదల చేసి పెన్షన్ దారులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Attachments area