అందరికీ అండగా నేనుంటా.

.

 

 

 

 

 

 

 

మీరందరూ నన్ను ఆశీర్వదించండి

-మాజీ మంత్రి కొండా సురేఖ

వరంగల్ బ్యూరో, మార్చి 17 (జనం సాక్షి)మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా మీ అందరికీ నేను అండగా ఉంటా మీరందరూ నన్ను ఆశీర్వదించండి తిరిగి ఎమ్మెల్యేగా గెలిపించండి అంటూ వరంగల్ నగరంలోని 33వ డివిజన్లో మాజీ మంత్రి కొండా సురేఖ ప్రజలను వేడుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం పెరిక వాడలోని బొడ్రాయి వద్ద నుండి తన పాదయాత్రను ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ రాబోయే రోజుల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని సురేఖ వేడుకున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వస్తుందని ప్రతి పేదవాడి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు వస్తాయని విద్య వైద్య ఆరోగ్యం అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని సురేఖ ప్రజలకు వివరించారు. అవినీతి రహిత పరిపాలన కాంగ్రెస్ ద్వారానే లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ముద్దసాని రాధిక శ్రీనివాస్, కత్తెరసాల శ్రీధర్, శివ, షేర్ల కిషోర్,  ప్రవీణ్, రాణి, రాజేశ్వరి, అరుణ, అత్తర్, మురళి స్వప్న తదితరులు పాల్గొన్నారు.