అంధత్వ రహిత తెలంగాణ ఏ ప్రభుత్వ లక్ష్యం:  – ఎంపిపి  అలేఖ్య వినీల్

అంధత్వ రహిత తెలంగాణ ఏ ప్రభుత్వ లక్ష్యం:  – ఎంపిపి  అలేఖ్య వినీల్నుబల్లి, మార్చ్ 31(జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకం గా చేపట్టిన కంటి వెలుగు కార్యక్ర మాన్ని పెనుబల్లి మండలంవంగాముత్యాలబంజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ భూక్య పంతులీ ఆధ్వర్యంలో శుక్రవారం  ఎం పి పి లక్కినేని అలేఖ్య వినీల్  ముఖ్య అతిధిగా పాల్గోని ప్రారంభించారు. కార్యక్రమం లో ఎంపీపీ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ,అంధత్వ రహిత తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు రెండవ విడత  కార్యక్రమాన్నిచేపట్టిందని అన్నారు, ఈసందర్భంగా ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో  స్థానిక ఎం పి టి సి వంగా ఝాన్సీనిరంజన్ గౌడ్,  మండల బి ఆర్ ఎస్ అధ్యక్షులు కనగాల వెంకటరావు, భుపాల్ రెడ్డి, మండల బి ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి భూక్యా ప్రసాద్, బి ఆర్ ఎస్పెనుబల్లి మండల యూత్ వింగ్ వంగా నిరంజన్ గౌడ్, గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి గోదా శ్రీనివాసరావు, సోషల్ మీడియా మరీదు చంద్రశేఖర్, నీలాదీశ్వర దేవస్తానం కమిటి డైరెక్టర్ వంగా సురేష్, గోగినేని రమేష్, కిన్నెర ప్రసాద్,పస్తం సంజీవ, గంధం దుర్గయ్య,పంచాయితీ సెక్రటరీ రవి, ఏఎన్ఎంలు మంగతాయారు, రాణి,ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, తదితరులు  పాల్గొన్నారు