అకట్టుకున్న కళాజాత ప్రదర్శనలు
సైదాబాద్ : దోమలద్వారా వ్యాపించే వ్యాదుల పట్ల అవగాహన కల్పించేందుకు జీహెచ్ ఎంసీ సహకారంతో శనివారం నిర్వహించిన కళాజాత ప్రదర్శనలు అకట్టుకున్నాయి. ఈ ప్రదర్శన రూరల్ అవేర్‌నేస్ ఫోక్ అర్ట్ అర్గనైజేషన్ అధ్వర్యంలో జరిగాయి. ఈ కళాజాతను కార్పోరేటర్ శ్రీనివాసరెడ్డిప్రారంభించారు. సైదాపూర్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. కళాకారులు జానపద గీతాలతో దోమలద్వారా వ్యాపించే వ్యాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించాల్సిగా గీతాలతో వివరించారు.