అక్టోబర్ 2న బసవ భవన్ భూమి పూజ కార్యక్రమం విజయవంతం చేయండి.

జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ .
తాండూరు సెప్టెంబర్ 25(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం వీరశైవ సమాజం ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ బావికి భద్రేశ్వర ఆలయంలో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమాని కి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్,శుభప్రద పటేల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరశైవస మాజం అధ్యక్ష కార్యదర్శులతో పాటు సభ్యులు కలిసి ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ అక్టోబర్ 2నకోకపేటలో బసవ భవన్ భూమి పూజ కార్యక్రమం విజయ వంతం చేయాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం హయాంలోని వీరశైవు లకు సముచిత న్యాయం జరుగుతుం దని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం గౌరవ అధ్యక్షులు తంబాకు చంద్రశేఖర్ అధ్యక్షులు పటేల్ శ్రీశైలం కార్యదర్శి ,గాజుల శాంతు కుమార్, ఉపాధ్యక్షు లు,జి .పరమేశ్వర్, సహాయ కార్యదర్శి పటేల్ విజయ్ కుమార్, కోశాధికారి కందనెల్లి ప్రకాశం, కార్యవర్గ సభ్యులు ఆర్ బసవరాజు, వాలి శాంత్ కుమార్ ,దూది నాగభూషణం, సడిగి భద్రప్ప, ఘనపూర్ శంకర్, నిర్ణీ చంద్రశేఖర్ ,ఆ బులం సంపత్ కుమార్ , బంటారం భద్రేశ్వర్ పాల్గొని సన్మానించారు. కార్యక్రమంలో తాండూరు వీరేశ్వర సమాజం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.