అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ఖండించిన కిషన్‌రెడ్డి
హైదరాబాద్: మజ్లిన్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఇతర మతస్థుల అచార వ్యవహారాలను విమర్శించడాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఖండించారు. అక్బర్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. మజ్లిన్ గుర్తింపు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అక్బర్ వ్యాఖ్యలపై శాసనసభ స్పీకర్, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన వెల్లడించారు.