అగ్ర కులాల పేదలను ఆదుకునేందుకు సంఘాలు కృషి చేయాలి

రెడ్డి సంక్షేమ సంఘం భవన శంకుస్థాపన కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా

మిర్యాలగూడ,జనం సాక్షి.
అగ్రకులాలలో గల పేదలను ఆదుకునేందుకు సంఘాలు పనిచేయాలని
తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి లు కోరారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని వై జంక్షన్ దగ్గర 1వ వార్డ్, యర్ర మాద రాజిరెడ్డి వ్యవసాయ భూమి పక్కన శ్రీ రాజా బహుదూర్ వెంకట్రాంరెడ్డి, విజ్ఞాన వికాస కేంద్రం, రెడ్డి సంక్షేమ సంఘ భవనానికి శంకుస్థాపన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడుతూ అగ్రకులాలలో కూడా నిరుపేదలు చాలామంది ఉన్నారని వారి అభ్యున్నతి కోసం సంఘాలు నడుము కట్టి పనిచేయాల్సిన అవశ్యకత మన ముందు ఉందన్నారు. రెడ్డిలలో పేదలను గుర్తించి వారి ఆర్థిక స్థితిగతులు, జీవన విధానాలను గమనించి ఆత్మ అభిమానంతో వారు బయటకు చెప్పకున్నా మనమే ముందుకు వెళ్లి పైకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర రాజధానిలో గల రెడ్డి వసతిగృహం నకు ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చిందని, అందులో వసతి సౌకర్యాలను పొంది వేల మంది ఉన్నత స్థితిలో ఉన్నారని వారు పేర్కొన్నారు. ముందుగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, నల్గొండ ఎంపీ ఎన్ ఉత్తంకుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ నూకల సరళ హనుమంత రెడ్డి, మున్సిపల్ చైర్మన్ భార్గవ్, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ( బిఎల్ఆర్) మిర్యాలగూడ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు అనుముల మధుసూదన్ రెడ్డిలు, రెడ్డి సోదరులు,శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అభ్యాస్ విద్యాసంస్థల చైర్మన్, కౌన్సిలర్ వంగాల నిరంజన్ రెడ్డి ,1వ వార్డు కౌన్సిలర్ షాగ జయలక్ష్మి జలంధర్ రెడ్డి, ఎంపీడీవో గార్లపాటి జ్యోతిలక్ష్మి, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్. రేపాల పురుషోత్తంరెడ్డి, వెంకట్ రెడ్డి, డిసిసిబి మాజీ డైరెక్టర్ సజ్జల రవీందర్ రెడ్డి, సర్పంచులు అంజిరెడ్డి, మర్రెడ్డి, సోము సోమిరెడ్డి, కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి, ముదిరెడ్డి నర్సిరెడ్డి రుణాల్ రెడ్డి, తోపాటు యాప నరేందర్ రెడ్డి, నామిరెడ్డి నరేందర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, రెడ్డి సోదరిమణులు, రెడ్డి సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.