అజాతశత్రువు.. అందరివాడు అజాతశత్రువు.. అందరివాడు నేడు ఎమ్మెస్ నటరాజన్ జన్మదినం..
ఎమ్మెస్ నటరాజన్.. ఈ పేరుతో పరిచయం లేని వారు నియోజకవర్గంలో ఎవరు ఉండరు.. నిస్వార్ధ నాయకుడుగా, నీతి గల నేతగా, అందరివాడుగా, ప్రస్తుత షాద్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఎమ్మెస్ నటరాజన్ ది. విద్యార్థి దశలోనే యువనేతగా కాంగ్రెస్ పార్టీ ద్వారా అడుగులు వేసిన ఎమ్మెస్ నటరాజన్ మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, డాక్టర్ పి. శంకర్రావు వంటి నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. ముఖ్యంగా ఒక దశలో మల్లు రవి_ శంకర్రావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్నప్పటికీ, నాయకులు రెండు వర్గాలుగా విడిపోయినప్పటికీ ఇద్దరితో సమన్వయంగా ముందుకు నడిచిన నేతగా నటరాజ్ కు పేరుంది. తెలంగాణ సాధన సమయంలో కూడా అలుపెరుగని పోరాటం చేసిన ఆయన తరువాత కాలంలో టిఆర్ఎస్ పార్టీలో చేరి కీలక భూమిక నిర్వహించారు. ప్రస్తుత ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అభిమానించే నాయకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో తనది సుదీర్ఘ ప్రస్తానమే అయినప్పటికీ ఏనాడు ఎలాంటి పదవులు ఆశించలేదు, పైరవీలు కాంట్రాక్టులతో డబ్బులు సంపాదించలేదు. నిజాయితీగల నాయకుడిగా తాను పనిచేసిన ప్రతి ఒక్కరి దగ్గర పేరు తెచ్చుకున్నారు. ఆయన పనితీరును చూసి గత పురపాలక ఎన్నికల్లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కౌన్సిలర్ గా టికెట్ ఇవ్వడమే కాకుండా, పురపాలిక వైస్ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు. రాజకీయాలు కలుషితమవుతున్న తరుణంలో నిస్వార్థ నాయకుడిగా పేరున నటరాజన్ మరింత ఉన్నతికి ఎదగాలని, ఉన్నత పదవులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన సందర్భంగా అరసవెల్లి శ్రీ సూర్య భగవానుడు దర్శనానికి వెళ్లిన ఆయనకు ఆ ప్రభాకరుడి కరుణాకటాక్షాలు సిద్ధించాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు