అధ్యయన కేంద్రపోషకులుగా అమితాబ్‌, కరణ్‌సింగ్‌

లండన్‌: ఇక్కడి ఆక్స్‌ఫర్డ్‌ హిందూ అధ్యయన కేంద్రం పోషకులుగా బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌, భారత సాంస్కృతిక సంబంధాల మండలి అధ్యక్షులుడ, భారత పార్లమెంటు సభ్యుడు కరణ్‌సింగ్‌లు బాద్యతలు స్వీకరించారు. హిందూ సంస్కృతి, మతం, చరిత్ర, కళలు, తదితర పలు ఆంశాలపై విస్తృత అధ్యయనాలు నిర్వహించడం ఓసీహెచ్‌ఎస్‌ ప్రధాన లక్ష్యం. పరిశోధకులకు ఈ కేంద్రం ఓ దిక్చూలిచాలా ఉపకరిస్తుందిన. ఆయా ఆంశాలపై ఉపన్యాసాలు, సదస్సులు, చర్చావేదికలను నిర్వహిస్తుంది. ఆక్స్‌ఫర్‌నడ విశ్వవిదా&్యలయ ముద్రణాలయం ద్వారా ఈ కేంద్రం ప్రత్యేక ప్రచురణలను అందుబాటులోకి తెస్తోంది. అమితాబ్‌ బచ్చన్‌, కరణ్‌సింగ్‌లిద్దరూ 2011మే నెలలో ఇక్కడ జరిగిన విశ్వవిఖ్యాత ఫోర్డ్‌ స్మారకోపన్యాసం చేసిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. 1997లో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఈ కేంద్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.