అధ్వాన్నంగా మారిన ప్రధాన రోడ్లు.అధ్వాన్నంగా మారిన ప్రధాన రోడ్లు. పట్టించుకోని అధికారులు. తప్పని ప్రమాదాలు.
జనం సాక్షి ఉట్నూర్.
అభివృద్ధికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలుపుతున్న గత భారీ వర్షాల వల్ల ప్రధాన బీటీ రోడ్లు గుంతల మాయంగా మారి ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. ఏజెన్సీలోని ఉట్నూర్ ఎక్స్ రోడ్డు నుండి 25 కిలోమీటర్లు జైనుర్ వరకు ఉన్న ప్రధాన బీటీ రోడ్డు గుంతల మయంగా మారింది. చాలా చోట్ల గుంతలు ఏర్పడి అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతూ ప్రాణ నష్టం జరుగుతున్న సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు ప్రజాపతినిధులు పట్టించుకోవడంలేదని వాహనదారులు ప్రజలు అంటున్నారు. వాహనదారులు ప్రతి ఏడాది వాహన పన్నులు చెల్లిస్తున్న రోడ్ల దుస్థితి గురించి మాత్రం ఆర్ అండ్ బి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వాహనదారులు పేర్కొంటున్నారు. కనీసం కిలోమీటర్ల మధ్యలో అక్కడక్కడ పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డ ఆర్ అండ్ బి అధికారులు ప్యాచ్ వర్క్ మరమ్మతు పనులు కూడా నిర్వహించడం లేదని వాహనదారులు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ దారి వెంట జిల్లా ఉన్నత అధికారులు ప్రజాప్రతినిధులు వెళ్తున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని రోడ్ల దుస్థితి గురించి పట్టించుకోవడంలేదని వాహనదారులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రధాన రోడ్డు మరమ్మత్తు పనులు చేయించి చర్యలు తీసుకోవాలని వాహనదారులు ప్రజలు కోరుతున్నారు.