అనారోగ్యంతో మాజీ ఎమ్మేల్యే మృతి

ముథోల్‌: మండలంలోని అస్తా గ్రామంలో మాజీ ఎమ్మేల్యే హనుమంతరెడ్డి(80) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఈయన 1985వ సంవత్సరంలో తెలుగుదేశం మొదటి ఎమ్మేల్యేగా ఎన్నికయ్యారు. గత రెండేళ్లుగా అనారోగ్యంతో ఉన్నారు. కుటుంబసభ్యులు హైదరాబాద్‌లో చికిత్స చేయించారు. ఈరోజు ఉదయం మృతి చెందారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, కూతురు ఉన్నారు.