అన్నదానం పరబ్రహ్మ స్వరూపం: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
గరిడేపల్లి, సెప్టెంబర్ 2 (జనం సాక్షి): అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో గొప్పదని అన్నదానం పరబ్రహ్మ స్వరూపం అని స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం గరిడేపల్లి మండల కేంద్రంలోని ఆటోనగర్ యందు గణేష్ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయం యందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఇట్టి కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు భక్తులు పెద్ద ఎత్తు సంఖ్యలో పాల్గొన్నారు.