అఫ్గానిస్థాన్‌లో 17 మందిని నరికి చంపిన తాలిబన్లు

కాంరహార్‌: సంగీతానికి తగ్గల్లు నృత్యం చేస్తూ విందును ఆస్వాదిస్తున్న ఓ బృందంపై అఫ్గానిస్థాణ్‌లో తాలిబన్లు అత్యంత పాశవిక చర్యకు ఒడిగట్టారు. విదిలో పాల్గొన్న ఇద్దరు మహిళలతోసహా 17 మంది పౌరుల తలలు నరికి చంపేశారు. ఇది తాలిబన్ల పనేనని హెల్మాండ్‌ గవర్నర్‌ ప్రతినిధి దవూద్‌ అహ్మదీ సోమవారం ఓ వార్తాసంస్థకు తెలిపారు. 15 మంది పురుషులు, ఇద్దరు మహిళల్ని తలలు నరికి చంపారు. తాలిబన్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో గ్రామస్థులు ఈ విందు ఏర్పాటుచేసుకున్నారు. అని అధికారులు తెలిపారు. పురుషులు, పరాయి స్త్రీలతో కలిసి నృత్యం చేసే కార్యక్రమాలను తాలిబన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. తాఆ ఘటన దక్షిణ అఫ్గాన్‌లోని జమింద్వార్‌ గ్రామం సమీపంలో చోటుచేసుకుంది.