అభివృద్ధి కార్యక్రమాల పైన గ్రామసభ…..
చిలప్ చేడ్/ఫిబ్రవరి/జనంసాక్షి :- మండలంలోని జగ్గంపేట గ్రామంలో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలపైన గ్రామ సర్పంచ్ మంతప్పఅధ్యక్షతన గ్రామసభ ఏర్పాటు చేసుకుని పారిశుధ్యం, త్రాగు నీరు, వీధిదీపాలు, ఉపాధిహామీ పనులు తదితర అంశాలపై చర్చించడం జరిగింది గ్రామంలోని కొందరు ఉపాధి కార్మికులు గతంలో చేసినటువంటి ఉపాధి హామీ డబ్బులు ఇప్పటివరకు రావడం లేదని కూలీలు ఆందోళన చేయగా వారికి త్వరలోనే ఉపాధి హామీ డబ్బులు తమకు ఇప్పిస్తామని సర్పంచి కార్యదర్శి వారికి హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాంతప్ప ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి వార్డు సభ్యులు యాదగౌడ్ రేణుక రవి పంచాయతీ కార్యదర్శి ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ అంగన్వాడీ టీచర్ శైనాజ్ బేగం గ్రామస్తులు బిక్షపతి రమేష్ గౌడ్ పోచయ్య శ్రీనివాస్ పెంటయ్య ఆగమయ్య నవీన్ తదితరులు పాల్గొన్నారు