అమర్‌నాథ్‌ యాత్ర శుభారంభం

పహల్గాం( జమ్ముకాశ్మీర్‌): అత్యంత విశిష్ఠమైన అమర్‌నాథ్‌ యాత్ర సోమవారం ప్రారంభమైంది. జమ్ముకాశ్మీరు గవర్నర్‌ ఎన్‌.ఎన్‌.వోహ్రా సోమవారం ఉదయం విశ్వవిఖాత అమర్‌రాథ్‌ ఆలయంలో పూజలు నిర్వహించారు.బల్టాల్‌… నున్‌వాన్‌బేస్‌క్యాంపుల నుంచి యాత్రికులు బయలు దేరారు. అనుకూల వాతావరణ పరిస్థితుల మూలంగా కాస్త ఆలస్యంగానే ఈ యాత్ర మొదలైంది. రాత్రంతా కురిసిన వర్షాల మూలంగా రోడ్లు జారుడుగా తయారవడంతో తెల్లవారుజామున భక్తుల ప్రయాణానికి అనుమతించలేదని అమర్‌నాధ్‌ ఆలయ బోర్డు అధికారులు వెల్లడించారు. యాత్రికుల వెంట సీఆర్‌పీఎఫ్‌ జవానులు రక్షణగా బైలుదేరాలు. ఆగష్టు రెండో తేదిన అమర్‌నాధ్‌ యాత్ర పరిసమాప్తమౌతుంది.