అమ్మ ఫౌండేషన్ మంచుకొండ కృప యోజన సంఘం ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు , పెన్నులు వితరణ.

 అమ్మ ఫౌండేషన్ మంచుకొండ కృప యోజన సంఘం ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు , పెన్నులు వితరణ. రఘునాధపాలెం  మార్చి 29(జనం సాక్షి) మండలం మంచుకొండ గ్రామంలో జెడ్.పి.ఎస్.ఎస్ హైస్కూల్ నందు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు అమ్మ ఫౌండేషన్ మంచుకొండ కృప యోజన సంఘం ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్లు , పెన్నులను ఫౌండర్ అండ్ చైర్మన్ మంద సంజీవరావు మరియు  ఆయన బృందంతో కలిసి అందజేశారు . ఈ సందర్భంగా  మాట్లాడుతూ జీవితంలో ఎన్ని కష్టనష్టాలు వచ్చినా  వాటిని ఎదుర్కొంటూ విద్యను అభ్యసించాలని . బాగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు . టెన్త్ క్లాస్ ఎగ్జామ్ లో ఫస్ట్ క్లాస్ మార్కులు సాధించిన విద్యార్థులకు అమ్మ ఫౌండేషన్ మంచుకొండ కృప యోజన సంఘం నుండి 5000 రూపాయలు  చొప్పున బహుమతి ఇస్తామని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ మంచుకొండ కృప యోజన సంఘం ట్రెజరర్ మంద నాగమణి , ఉపాధ్యక్షులు మారుపాక పృద్వి , గౌ” అధ్యక్షులు పసలపూడి రమేష్ , సలహాదారులు చిన్ని డేవిడ్  పి రవి కిరణ్  మంచుకొండ జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు అంజన్ రావు మరియు టీచర్స్ లు  మంచుకొండ గ్రామపంచాయతీ సెక్రెటరీ కే మధు  అటెండర్ , ఆయా  టి రామారావు మరియు అమ్మ ఫౌండేషన్ మంచు మంచుకొండ కృప యోజన సంఘం కమిటీ సభ్యులు  తదితరులు పాల్గొన్నారు .