అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధి బిఎస్పీ పార్టీతోనే సాధ్యం
అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధి బిఎస్పీ పార్టీతోనే సాధ్యంరాష్ట్ర అభివృద్ధిలో బిఆర్ఎస్ పార్టీ విఫలం
బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు య.సి. కేశవరావు, ఇంచార్జి ఎం. జి. కృష్ణఇటిక్యాల (జనంసాక్షి) మార్చి 28 : రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రాజెక్టుల పేరుతో మోసం చేస్తూ ఓట్లు దండుకుంటున్నారు తప్ప నియోజకవర్గం అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయడం లేదని అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధి బీఎస్పీ పార్టీతోనే సాధ్యమని జోగులాంబ గద్వాల జిల్లా బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎం సి. కేశవరావు, ఇంచార్జి ఎం.జి. కృష్ణ లు అన్నారు. మంగళవారం ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలో జిల్లా ఇంచార్జ్ ఎం.జి. కృష్ణ స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడమే తప్ప అభివృద్ధిలో మాత్రం రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయని వారన్నారు. అలంపూర్ నియోజకవర్గంలో తుమ్మిళ్ల లిఫ్ట్, వల్లూరు మల్లమ్మ కుంట, ఆర్డిఎస్ కెనాల్ ను పూర్తి చేసి రైతులకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని ఎన్నికల సమయంలో ప్రగల్బాలు పలికిన హామీలు ఏమయ్యాయని వారు ప్రశ్నించారు. నడిగడ్డ ప్రాంతం కృష్ణ, తుంగభద్ర నదుల మధ్యలో ఉన్న సాగునీరుకు, తాగునీరుకు నోచుకోవడం లేదన్నారు. రాబోయే ఎన్నికలలో బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగుల కోసం భారీ ఎత్తున ఉద్యోగ భర్తీతో పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్యం సేవలు అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామనన్నారు. అంతేకాకుండా గ్రూప్ 1 గ్రూప్ 2 సంవత్సరం నుండి విద్యార్థులు కష్టపడి చదువుతున్న నిరుద్యోగలను మోసం చేస్తూ పరీక్ష పత్రాలను లీక్ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారంపై డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 30 లక్షల మంది నిరుద్యోగ యువకుల పక్షాన పోరాటం చేస్తున్న వ్యక్తిని అరెస్టుల పేరుతో అణిచివేయడం ఎంతవరకు సమంజసమని విమర్శించారు. డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఈ నెల 29 నుండి ఐదు రోజులపాటు బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోవడం జరుగుతుంది అన్నారు. రాజ్యాధికార యాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని వారు కోరారు. అలాగే డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు స్వేరోస్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అలంపూర్ చౌరస్తాలో 60 రోజులపాటు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వారన్నారు. శిక్షణ పొందిన యువతి యువకులకు జాబ్ మేళా నిర్వహించి ఉపాధి కల్పనకు వివిధ ఇండస్ట్రీలో పంపించడం జరుగుతుందని వారన్నారు. ఈ సమావేశంలో జిల్లా బిఎస్పి పార్టీ నాయకులు రాంబాబు, తిరుపాలు, రేపల్లె రాజు తోపాటు బీఎస్పీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.