అల్లర్లఓ దెబ్బతిన్న ప్రార్థనా స్థలాల వివరాల్విండి

గుజరాత్‌కు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ : గుజరాత్‌ అల్లర్లలో దెబ్బతిన్న ప్రార్థనా స్థలాల వివరాలతో నివేదిక సమర్పించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దెబ్బతిన్న ప్రార్థనా మందిరాలను పున:నిర్మించడానికి, మరమ్మతులు చేయడానికి ఎంత మొత్తం అవసరమవుతుందో అంచనా వేయాలని పేర్కొంది. 2002లో జరిగిన ఘర్షణల్లో ధ్వంసమైన ప్రార్థనా స్థలాలకు పరిహారం చెల్లించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ గుజరాత్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కె.ఎస్‌.రాధాకృష్ణన్‌, జస్టిస్‌ దీపక్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టిపై ఆదేశాలు ఇచ్చింది. వరదలు, భూకంపాల్లో ఇళ్లు కొట్టుకుపోతే పరిహారం ఇస్తారు కదా.. ఆధ్యాత్మిక కేంద్రాలు దెబ్బతింటే ఎందుకు ఇవ్వరని ధర్మాసనం ఈ సందర్భంగా ప్రశ్నించింది. దెబ్బతిన్న ప్రార్థనా స్థలాలపై సర్వే నివేదికను సమర్పించాలంటూ తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.