అవకాశాలను యువ శాస్త్రవేత్తలు అందిపుచ్చుకోవాలి: అబ్దుల్‌ కలాం

హైదరాబాద్‌, మార్చి 20 : యువ శాస్త్రవేత్తలు అవకాశాలను అందిపుచ్చుకోవాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అన్నారు. బాలానగర్‌లోని నైపర్‌లో నిర్వహించిన సెమినార్‌కు హాజరైన కలాం మాట్లాడుతూ అరుదైన వ్యాధుల నివారణకు మందుల తయారీలో యువ శాస్త్రవేత్తలు కృషి చేయాలని సూచించారు. ఇండియా ఫార్మా రంగానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉందని, దీనిని యువ శాస్త్రవేత్తలు అవకాశంగా తీసుకోవాలని అన్నారు.