అవినీలికి పాల్పడిన ఉద్యోగులపై కేసులు

శంషాబాద్‌: శంషాబాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో సీనియర్‌ ఆసిస్టెంట్‌ సూరయ్య లంచం తీసుకుంటూ అధికారులకు దొరికిపోయాడు. సబ్‌రిజిస్ట్రర్‌ నరేందర్‌రెడ్డి ఏసీబీ అధికారులను చూపి పారిపోయాడు. అవినీతికి పాల్పడిన ఉద్యోగులపై కేసులు నమోదుచేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.