అసలు ఈ కుక్కలకి ఏమైంది..!  రాష్ట్రంలో రోజోచోట కుక్కల ఘటన. లేగ దూడను చంపిన కుక్కలు..

భైంసా రూరల్ ఫిబ్రవరి 25జనం సాక్షి
రాష్ట్రంలోని కుక్కలన్నీ మీటింగ్ పెట్టుకుని  రాష్ట్రంలో రోజూచోట ఏదో ఒక మాదిరిగా అటాక్ కి దిగినట్లు ఉన్నాయని ఇప్పుడు కుక్కలు ప్రవర్తిస్తున్న తీరుపై ప్రజలు ఫన్నీగా సెటైలర్స్ వేస్తూ చర్చించుకుంటున్నారు. బాసర మండల కేంద్రంలో వీది కుక్కల బెడద ప్రజలకు భయాన్ని కగిస్తుంది. శుక్రవారం రాత్రి కొట్టే సాయిలు పశువుల పాకలో చొరబడిన కుక్కలు లేగ దూడను చీల్చితినడం జరిగింది. చిన్న పిల్లలపై సైతం వీది కుక్కలు దాడికి దిగిన సందర్భాలు కూడా ఉన్నాయనీ ప్రజలంటున్నా రు. ఇకనైనాగ్రామ పంచాయితీ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.