అసోం చేరుకున్న సోనియా

గౌహతి: అల్లర్లు చెలరేగిన ప్రాంతల్లో పర్యటించేందుకు యూపీఐ ఛైర్‌పర్సస్‌ సోనియాగాంధీ అసోంకు చేరుకున్నారు. హింస చోటుచేసుకున్న కోక్రాఝార్‌, డుబ్రీ జిల్లాల్లో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే, అసోం ముఖ్యమంత్రి తరుణ్‌గోగాయితో కలిసి సోనియా పర్యటించనున్నారు. సహాయక శిబిరాలను సందర్శించి బాధితులను పరామర్శించనున్నారు. ఈ రెండు జిల్లాల్లో హింస చెలరేగి 77 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.