ఆజాద్‌కు ఘనస్వాగతం
హైదరాబాద్: నగరంలోని హైటెక్స్‌లో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ గులాం నబీ ఆజాద్ ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రి దానం నాగేందర్‌లతో పాటు మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి నిరంజన్ తదితరులు శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం పలికారు.