ఆటో-కారు ఢీ ఇద్దరి మృతి

అడ్డాకుల: మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల సమీపంలోని జాతీయ రహదారిపై ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జాతీయ రహదారిపై ప్రయాణికులతో బస్టాండులోకి మళ్లుతున్న ఆటోను కారు వేగంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న పూరటి చిన్నమ్మ, సంగం బాలయ్య అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన ఐదుగురిని మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.