ఆడపడుచులకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ఎంపీపీ వై రాజారెడ్డి
మల్దకల్ సెప్టెంబర్ 23 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలో గద్వాల శాసన సభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బిజ్వారం గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం దసరా పండుగ కానుకగా బతుకమ్మ చీరలను ఎంపీపీ వై రాజారెడ్డి ఆడపడుచులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ వై.రాజారెడ్డి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికై కృషిచేసే ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు. మహిళలకు ఉపాధి నిమిత్తమై వ్యాపార రంగంలో మహిళా పొదుపు సంఘాల ద్వారా ఎక్కువ మొత్తంలో నిధులు విడుదల చేస్తూ వారి ఎదుగుదల కోసం నిరంతరం కృషి చేస్తూ వారి కుటుంబాల్లో బంగారు బాటలు వేసేందుకు కృషి చేస్తుందని అని అన్నారు.ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో ఈసారి బతుకమ్మ పండుగను జరుపుకోనుందని,తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన బతుకమ్మ పండుగను గ్రామ గ్రామాన ప్రతి ఆడపడుచు పాల్గొని ఘనంగా జరుపుకోవాలని కోరారు.ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మన ఇంటిలో అన్నగా మన ఆడపడుచులకు బతుకమ్మ పండుగకు తన పుట్టినింటి ఆడపడుచులకు మాదిరిగా చీరలు పంపిణి చేయడం చాలా ఆనందదాయకమన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మన్న,డీలర్ విజయ్ భాస్కర్ రెడ్డి,టిఆర్ఎస్ కార్యకర్తలు తెలుగు నరసింహులు,తిమ్మప్ప,ఉప్పరి కిష్టన్న తదితరులు పాల్గొన్నారు.
Attachments area