ఆదర్శ విప్లవ స్త్రీ మూర్తి సావిత్రిబాయి పూలే కి ఘన నివాళి


హుజూర్ నగర్ మార్చి 10 (జనంసాక్షి): ఆదర్శ విప్లవ స్త్రీ మూర్తి, ఆధునిక భారతీయ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జీవితం ఆదర్శవంతమని బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ కన్వీనర్, ధూళిపాళధనుంజయ నాయుడు అన్నారు. శుక్రవారం హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సావిత్రిబాయి పూలే 126వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ ఆడపిల్లల చదువు కోసం నిరంతరం పాటుపడిన చైతన్య మహిళా మూర్తి అని, సమాజంలోని రుగ్మత లను రూపుమాపడానికి విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారణీఅని స్త్రీల విద్యాభివృద్ధి కొరకు, స్త్రీల హక్కుల కొరకు నాటి చాందసవాదులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మడమ తిప్పకుండా చివరి శ్వాస వరకు ఉద్యమించిన ధీశాలి ఆయన అన్నారు. చిన్న వయసులోనే మహాత్మ జ్యోతిబాపూలేతో వివాహం జరిగినప్పటికీ, సావిత్రిబాయికి చదువు పట్ల ఉన్న ఆసక్తి గమనించిన పూలే గారే స్వయంగా సావిత్రిబాయి చదువు నేర్పించి భారతదేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దారని భావి భారతానికి సరైన మార్గం ఎంచుకొని తన 17వ ఏటనే తాము ఏర్పాటు చేసిన పాఠశాలలో తొలి మహిళా టీచర్ గా విద్య నేర్పించే బాధ్యత తీసుకున్నారని ఆయన తెలిపారు. ఆడపిల్లలను చదువు కోసం బయటికి పంపిస్తానికి అంగీకరించని నాటి సమాజంలో 1848-53 ల మధ్యకాలంలో 18 పాఠశాలలు స్థాపించారని, 1890 సంవత్సరంలో 63 ఏళ్ల వయసులో జ్యోతిరావు పూలే పురంపదించగా, 60 ఏళ్ల వయసులో సావిత్రిబాయి పూలే తన భర్త చితికి తానే నిప్పుటించారని, 140 ఏళ్ళ నాడు అది చారిత్రాత్మక ఘట్టం అని ఆయన గుర్తు చేశారు.
స్వాతంత్రం వచ్చి 8 దశాబ్దాలుకావస్తున్నా నేటికీ మహిళ పట్ల అత్యాచారాలు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయని, మహిళలు ఇంకా వివక్షతకు గురువుతూనే ఉన్నారని, నేటికీ చట్టసభల్లో మహిళలకు సరైన ప్రాతినిధ్యం లేదని చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ సాధించడమే సావిత్రిబాయి పూలే కు ఇచ్చే ఘన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం హుజూర్నగర్ నియోజకవర్గ అధ్యక్షుడు ధూళిపాళ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు బొడ్డు గోవిందరావు, మహిళా సంఘం పట్టణ అధ్యక్షురాలు గూడెపు దీప, సహాయ కార్యదర్శి బండి నాగేశ్వరరావు, అమరోజు నాగరాజు, మేకల చిన్న సైదులు, సంజీవరావు, రామాచారి, రాయల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.