ఆదివరాహస్వామి ఆలయంలో బీఆర్ఎస్ యువ నేత దంపతుల ప్రత్యేక పూజలు

జనం సాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ఇనగంటి రామారావు – హిమబిందు వివాహ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం కమాన్ పూర్ మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఆధివరహా స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి చిత్రపటాన్ని వారి దంపతులకు అందజేసి శాలువాతో ఆలయ డైరెక్టర్లు సన్మానించారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల ఆధ్వర్యంలో ఇనగంటి రామారావు – హిమబిందు దంపతుల వివాహా వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.