ఆన్‌లైన్ చీటింగ్ కేసులో ఎండీ రమేష్ అరెస్టు
హైదరాబాద్: ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్న సిటీ ఆన్‌లైన్ ట్రేడింగ్ ఎండీ రమేష్‌రెడ్డిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. రూ.100కోట్లకు పైగా ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడినట్లు రమేష్‌రెడ్డిపై ఆరోపణలున్నాయి. రమేష్‌రెడ్డి నుంచి విలువైన పత్రాలు, భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో మొత్తం 5సిటీ ఆన్‌లైన్ బ్రాంచ్‌లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.