ఆఫ్గనిస్తాన్‌లో రెండు సార్లు భూప్రకంపనలు

కాబూల్‌ : ఆఫ్గనిస్తాన్‌లో ఈ రోజు ఉదయం రెండు సార్లు భూప్రకంపనలు సంభవించాయి. ఉదయం 10.30 గంటలు సమయంలో, 10.59 గంటలకు మరో సారి భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలు పై తీవ్రత మొదటి సారి 5.4గా… రెండో సారి 5.9గా నమోదైంది. హిందుకుష్‌ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు.