ఆమ్ ఆద్మీ పార్టీకి నేను ఓటు వేయను : అన్నా
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీకి తాను ఓటు వేయనని అన్నా హజారే అన్నారు. ఇప్పటవరకూ వేయాలనే అనుకున్నానని, కానీ ఆ పార్టీ కూడా ఇతర పార్టీల్లాగే ‘డబ్బుతో అధికారం, అధికారంతో డబ్బు’ అన్న పంధాలోనే వెళ్తోందని కేజ్రీవాల్‌కి అధికారంపై ఆశ వుందని హజారే అభిప్రాయపడ్డారు. కేజ్రీవాల్ నిజాయతీ గల అభ్యర్థులను ఎంచుకుంటే ఆ పార్టీకి ఓటేస్తానని హజారే గతంలో ఓ సందర్భంలో పేర్కొన్నారు.