ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా

రామగుండం : కరీంనగర్‌ జిల్లా రామగుండం కుందనపల్లి వద్ద రాజీవ్‌రహదారిపై ఆయిల్‌ ట్యాంకర్‌ అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో బోల్తాపడింది. దీంతో ట్యాంకర్‌లో ఉన్న పామాయిల్‌ అంతా నేలపాలైంది.దీని విలువ సుమారు 14 లక్షల రూపాయల మేరకు ఉంటుందని అంచనా. కాకినాడ నుంచి ఇండోర్‌కు వెళుతూ కుందనపల్లి వద్ద బుధవారం ప్రమాదానికి గురైంది. ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తాపడ్డ విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి తండోపతండాలుగా అక్కడి చేరుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న క్యాన్లు, బిందెలు,వాటర్‌ బాటిళ్లలో పామాయిల్‌ను ఇళ్లకు తరలించారు. గుజరాత్‌కు చెందిన ఆయిల్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ ఖాన్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు.