ఆర్టీపీపీలో నిర్వాసితుల ఆందోళన
కడప: ఎర్రగుంట్ల మండలం కలమల వద్ద రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఆరో యూనిట్ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. నిర్మాణ పనులు చేపట్టిన ఇందు సంస్థ కార్యాలయంపై దాడికి దిగారు. కంప్యూటర్లు, వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. తమకు పరిహారం ఇవ్వాలని, ఆర్టీపీపీలో ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ వ్యక్తం చేశారు.