ఆర్టీసీ కార్మికులకు జిల్లా కేంద్రంలోనే వైద్య సౌకర్యం

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులకు ఆయా జిల్లా కేంద్రాల్లోనే వైద్య సౌకర్యం అందించేందుకు యాజమాన్యం అంగీకరించిందని కార్మికుల సంఘం ఎన్‌.ఎం.యూ ఆధ్యక్షుడు నాగేశ్వరరావు తెలిపారు. ఆయా జిల్లా కేంద్రాల్లోని కార్మికుల కుటుంబాలకు ఉచిత వైద్య సౌకర్యం అందేలా ఆర్టీసీ ..సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకోనుందని ఆయన వివరించారు. కాంట్రాక్టు కార్మికుల సర్వీసుల క్రమబద్దీకరణ విషయంలో కూడా యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నట్లు నాగేశ్వరరావు చెప్పారు.