ఆర్మ్‌స్ట్రాంగ్‌ మరణంపై బరాక్‌ ఒబామా సంతాపం

వాషింగ్టన్‌: చందమామపై కాలుమోపిన మొట్టమొదటి మానవుడు నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ మరణంపై అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సంతాపం వ్యక్తంచేశారు. అమెరికా అత్యుత్తమ హీరోల్లో ఆయనొకరని కొనియాడారు. మానవాళికి సంబంధించి ఆయన సాధించిన ఘనత ఎన్నటికీ మరువలేనిదని చెప్పారు. 1969 జులై 20న చంద్రుడిపై కాలుపోపిన ఆర్మ్‌స్ట్రాంగ్‌.. హృద్రోగ సమస్యతో శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే.1969 అపోలో-11 వ్యోమనౌకలో చంద్రుడి మీదకు బయలుదేరినప్పుడు. ఆయన జాతి యావత్తు ఆకాంక్షలను మోసుకెళ్లారు. అని ఒబామా పేర్కొన్నారు. ఒక చిన్న అడుగుకున్న అసాధారణ శక్తిని చాటిన ఆయన చిరస్మనణీయుడు అని తెలిపారు. ఆయన నైపుణ్యం, అంకితభావం నిస్వార్థ భావనలు గొప్పవని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తి అజరామరమని పేర్కొన్నారు.