ఆసరా పెన్షన్స్ గుర్తింపు కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్-గుమ్ముల గంగాదేవి.

నెరడిగొండసెప్టెంబర్3(జనంసాక్షి):
 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నూతనంగా మంజూరు చేసిన ఆసరా పింఛన్ల గుర్తింపు కార్డులను శుక్రవారం రోజున మండల కేంద్రంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు చేతుల మీదుగా అందజేశారు.కొందరు లబ్ధిదారులు అందుబాటులో లేక మిగిలిన కార్డులను ఆయా గ్రామ పంచాయతీలలో శనివారం నాడు సర్పంచ్ పంచాయతీ కార్యదర్శులు చేతుల మీదుగా అందజేశారు.ఇందులో భాగంగా మండలంలోని వాగ్దరి జీపీ సర్పంచ్ గుమ్ముల గంగాదేవి చేతులమీదుగా పెన్షన్ గుర్తింపు కార్డులను వాగ్దరి మాదాపూర్ గ్రామ లబ్ధిదారులకు అందించారు లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తోపాటు ఉప సర్పంచ్ మోహన్ జీపీ సెక్రటరీ ప్రభాకర్ ఆసరా పింఛన్ లబ్ధిదారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.