ఆ కర్మాగారం అనుమతిలేకుండా నడుస్తోంది: అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌

హైదరాబాద్‌: జీడిమెట్లలో అగ్నిప్రమాదం జరిగిన భారత్‌ హాల్వెంచర్‌ రసాయనాల కార్మాగారం అనుమతి లేకుండా నడుస్తోందని అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ జయరాం నాయక్‌ వెల్లడించారు. ప్రమాద ఘటన స్థలాన్ని సందర్శించిన అనంతరం ఆయన ప్రమాద కారాలపై విచారణ జరుపుతున్నట్లు తెలియజేశారు. చుట్టుపక్కల ఉన్న కార్మాగారాలకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమించారని చెప్పారు. రసాయనాలు మండుతున్నందువల్లనే మంటలు త్వరగా అదుపులోకి రాలేదని ఆయన చెప్పారు. అనుమతులు లేకుండా కార్మాగారం నడుస్తున్నట్లు తేలితే చర్యలు తప్పవని ఇన్స్‌పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ వైదేహి చెప్పారు. జీడిమెట్ల పారిశ్రమిక వాడలో తరుచూ తనిఖీలు నిర్వహిస్తున్నామని, భారత్‌ హాల్వెంచర్‌ కార్మాగారంలోపల ఉన్న రసాయనాల పూర్తి వివరాలు, సిబ్బంది చేస్తున్న పని గురించి ఇంకా తెలియాల్సివుందని తెలియజేశారు.