ఇంజినీరింగ్‌ కాలేజీల ఫీజు పెంచాలి

హైదరాబాద్‌: ఇజినీరింగ్‌ కళాశాలల్లో ఫీజు పెంపు వ్యవహారం పరిష్కారం అయ్యే విధంగా లేదు. తాము 35 వేలకు మించి ఇవ్వలేమని అందుకే ఒప్పుకోవాలని ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పటంతో అనేక కళాశాలలు అంగీకరించాయి. దీంతో ప్రమాణాలు పాటిస్తామని పత్రాలు ఇచ్చిన ఇంజినీరింగ్‌ కళాశాలలు హైకోర్టులో పిటీషన్‌ వేశాయి. 35 వేల ఫీజు తమకు గిట్టుబాటు కాదని పేర్కొన్నాయి. దీంతో అనెక్జర్‌ 1 (సి)లో పేర్కొన్న కళాశాలలకు ఫీజు రూ.50,200గా నిర్ణయించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.